నాపై కేటీఆర్ గెలిస్తే ..రాజకీయాల నుంచి తప్పుకుంటా

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేద్దాం. నేను సిరిసిల్లలో పోటీ చేస్తా. నాపై కేటీఆర్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిరిసిల్లలో ఆయన ఓడితే బీఆర్‌ఎస్‌ను మూసివేస్తామని ప్రకటించాలి అని సవాల్ చేశారు.