కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు. పీసీసీ కమిటీల్లో వెంకటరెడ్డికి హై కమాండ్ అవకాశం ఇవ్వలేదు. స్టార్ క్యాంపెయినర్ పదవిని కూడా ఏఐసీసీ తొలగించింది. తెలంగాణ పీసీసీ కమిటీని హైకమాండ్ ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్, ప్రత్యేక ఆహ్వానితులుగా వర్కింగ్ ప్రెసిడెంట్లను, అలాగే 40 మంది సభ్యులతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటినీ నియమించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి, 26 మంది డీసీసీ ప్రెసిడెంట్లను నియామకం చేసింది. 24 మంది వైస్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే 84 మందిని జనరల్ సెక్రటరీలుగా ఏఐసీసీ నియమించింది.













