కాంగ్రెస్ ఎంఎల్ఎల సభ్యత్వ రద్దు కేసు విచారణ వాయిదా
కాంగ్రెస్ ఎంఎల్ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాల రద్దు కేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ సిసి పుటేజ్‌లను సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసును ఈనెల 22కు వాయిదా వేసింది. శాసనసభ ప్రారంభమైన రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంఎల్ఎలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంఎల్ఎలు విసిరిన మైక్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కాంగ్రెస్ ఎంఎల్ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలను అసెంబ్లీ స్పీకర్ రద్దు చేశారు. దీంతో ఈ అంశంపై కాంగ్రెస్ ఎంఎల్ఎలు హైకోర్టులో పిటిషన్ వేశారు.













