చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలి : రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి అమిత్ షా వచ్చిన మరుసటి రోజే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ బయటపడిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్కామ్‌లూ బయటపడతాయని జోస్యం చెప్పారు. తన రాజీనామాతోనే ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం మునుగోడుకు వచ్చారని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.













