మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
మునుగోడు ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినా కానీ రాజకీయ కాక మాత్రం తగ్గలేదు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రెండు గంటలకుపైగా రోడ్డుపై భైఠాయించారు. దీంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో ఆయనను తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. ఉద్రికత్త నడము రాజగోపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉప ఎన్నిక సందర్బంగా నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం, ఇప్పుడు తాత్సారం చేస్తోందని రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో మునుగోడులో రాజకీయ వేడి రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
కాగా, గెలుపు తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా చండూరులో టీఆర్ఎస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. అలాగే చౌటుప్పల్లో భారీ స్వాగత కార్యక్రమంలో పాటు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల నినాదాలతో మునుగోడులో ఉద్రికత్త నెలకొంది.













