కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి?
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికారుజన ఖర్గే సమక్షంలో చేరనున్నట్టు తెలిసింది. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చత్రం తిప్పుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించి రాజగోపాల్ రెడ్డి చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.













