కిరణ్ కుమార్ ని గెలిపించి సోనియా రుణం తీర్చుకోండి.. కోమటిరెడ్డి

పేదలకు న్యాయం చేయాలి అని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ముందుకు తీసుకువస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ పథకాల ద్వారా రైతులు, యువత, మహిళలు లబ్ధి చెందుతారని ఆయన అన్నారు. విడుదల వారీగా అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక పురోగతి తీసుకురావడమే తమ ప్రభుత్వం లక్షమని ఆయన అన్నారు. అంతే కాదు భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం ద్వారా తెలంగాణను అందించిన సోనియా గాంధీ రుణం తీర్చుకున్నట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.