మమతాతో మీటింగ్ అదిరిందా…
కేంద్రంలోని నరేంద్ర మోదీకి మద్దతిస్తూ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటారేమింటూ నిన్న మమతా బెనర్జీ తనను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొట్టికాయలు వేశారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సాధారణ జీవితం గడుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని, తన విలాసవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలని సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. అసలు, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి విమర్శించారు.













