ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి షాక్
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో ప్రస్తుతం ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ లోక్ సభ స్థానం ఉంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. నల్గొండ అంటే తనకు ప్రాణమని, అందుకే రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తాని తేల్చి చెప్పారు. కాగా ఈ నెల 28న నల్లగొండలో జరిగే నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీనే నిరుద్యోగ నిరసన సభ జరగాల్సి ఉంది. అయితే తనను సంప్రదించకుండా ఎలా సభ ఏర్పాటు చేస్తారంటూ కోమటిరెడ్డి ప్రశ్నించడమే కాకుండా ఆ నిరసన సభలో పాల్గొనబోనని ప్రకటించారు. దీంతో అధిష్ఠానం పెద్దలు కోమటిరెడ్డితో మాట్లాడి ఆ నిరసన సభను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.













