Narender Reddy: పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ`1గా ఉన్న నరేందర్ రెడ్డి (Narender Reddy)ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టు (Kodangal Court) లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ (Vikarabad) తరలించనున్నారు. రెండు రోజుల పాటు ప్రశ్నించనున్నారు.