నాగలి, కాగడా, ఆటో!
తెలంగాణ జన సమితిగా ప్రజల్లోకి వెళ్లబోయే ప్రొఫెసర్ కోదండరాం పార్టీ ఎన్నికల గుర్తు కొత్తగా ఉండేలా అడుగులు వేస్తోంది. అన్నదాతలకు చేరువయ్యేలా రైతు నాగటి, నాగలి, కాగడా, ఆటో గుర్తుల్లో ఏదో ఒకటి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి చేసుకున్న దరఖాస్తుల్లో పేర్కొనట్లు తెలుస్తోంది. రైతు, నాగలి ఏదైనా సామాన్యులకు చేరువవుతుందని, కాగడ అయితే ఉద్యమ స్ఫూర్తి తెలిసేలా ఉంటుందని, ఇక ఆటో కార్మికుల అజెండగా కనిపించడంతో పాటు ఓటింగ్ సమయంలో ప్రత్యేకంగా కలిసొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ గుర్తు కారు కాబటి తమకు ఆటో వస్తే ఓటువేసే సమయంలో ఎక్కువ మంది పొరబడే అవకాశం ఉండొచ్చని, దాంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు పార్టీ పేరు, జెండా, ప్రకటించనున్నట్లు ఇప్పటికే తెలిపారు. జేఏసీకి రాజీనామా చేసి నాయకులంతా పార్టీలో చేరేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.













