క్లిమామ్ కు అంతర్జాతీయ పురస్కారం
హైదరాబాద్ కేంద్రంగా వెల్నెస్ అండ్ ఫార్మ్స్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్లిమామ్కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. హెల్త్ కేర్ లీడర్ క్యాటగిరీలో అమెరికా, రష్యా, బ్రిటన్‌తో పాటు వివిధ దేశాలు పోటీపడగా.. క్లిమామ్కు టాప్ 100లో చోటుదక్కింది. దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ హెల్త్‌కేర్ (ఐఎఫ్‌ఏహెచ్) కార్యక్రమంలో క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్వారెడ్డి ఈ అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో విశేష కృషి చేసినందుకు ఈ పురస్కారం దక్కింది. అవార్డు లభించడంపై అల్లోల దివ్యారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. క్లిమామ్కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు రావడం తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు.













