Kishan Reddy: తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి : కిషన్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy )తీవ్రంగా ఖండిరచారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ(congress party), తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల (Police) సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. పోలీసులను వెంట తీసుకొచ్చి బీజేపీ కార్యాలయం(BJP office) పై దాళ్లు విసిరారని, పోలీసులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజమని హైదరాబాద్ సీపీని ప్రశ్నించారు. బీజేపీ తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లమీద తిరగలేరని హెచ్చరించారు. రోజు రోజుకూ కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ, నిరాశతో భౌతిక దాడులకు దిగడాన్ని ప్రజలు క్షమించరన్నారు.