మనుషుల ప్రాణాలు పోతుంటే.. .రాజకీయాలు
మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదని, కేసీఆర్ కుటుంబం కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోని కరోనా బాధితులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలను పరిశీలించారు. అనంతరం కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలు, మూడు షిప్టులో ఉత్పత్తి ప్రారంభించిందని అన్నారు. గాలి ద్వారా కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో నమోదవుతున్న కేసులు, మరణాలను బట్టి కేంద్రం టీకా, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోందని వివరించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా అవుతుందని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చేవారంలో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వరంగల్, కరీంనగర్లో సైతం ఆక్సిజన్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాక్సిన్ ధరలను కేంద్రం నిర్ణయించదన్నారు. కర్ణాటక, ఒడిషాల నుంచి తెలంగాణ 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా జరుగుతోందన్నారు. లాక్డౌన్, ఆంక్షలపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయని తెలిపారు.













