21న కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకారం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ బాధ్యతలను ఈనెల 21న అధికారికంగా స్వీకరించనున్నారు. ఈ మేరకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి చాంబర్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆషాడం పూర్తయి శ్రావణమాసం మొదలైన నేపథ్యంలో ఈ నెల 21న ఆయన అధికారికంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనను ఈ నెల 23న ఖమ్మం జిల్లాలో కిషన్‌రెడ్డి జరపనున్నారు. ఈ నెల 29న ఖమ్మంకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఖమ్మంలో ప్రిపరేటరీ మీటింగ్‌ను కిషన్‌రెడ్డి నిర్వహించనున్నారు.













