మోదీ మూడోసారిగా ప్రధాని కావడం ఖాయం : కిషన్ రెడ్డి

జూన్ 8 లేదా 9న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్‌లో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మోదీ వచ్చాక మత కలహాలు, కర్ఫ్యూలు లేవని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ దిగుమతి చేసుకునే వాళ్లమన్న ఆయన, ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతి చేశారని విమర్శించారు. ఆర్టికల్ 370 పేరుతో ఎన్నో దారుణాలు చేశారని, బీజేపీ ప్రభుత్వం దానిని తొలగించిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ దేశాభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెక్యూలర్ పేరుతో దేవాలయాలను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు.