ఎన్నికల కోసమే కొత్త పథకాలు : కిషన్ రెడ్డి
ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం మరవలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కమ్యూనిస్టులది అవకాశవాద రాజకీయాలని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసింది. సకాలంలో రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు డిఫాల్టర్లుగా మారారు. వరదలతో రైతులు నష్టపోయినా పరిహారం ఇవ్వలేదు. దళితబంధును బీఆర్ఎస్ నాయకుల బంధుగా మార్చారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.













