ప్రగతి భవన్ లోనా? ఫామ్ హౌస్ లోనా ? కేసీఆర్ తో రెడీ
కేంద్రంపై బురద జల్లెందుకు అసెంబ్లీని వాడుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన న్యూ ఢిల్లీ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత బడ్జెట్ ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు మాట్లాడరు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో కేసీఆర్ పరిధి దాటి మోదీపై మాట్లాడారు. బడ్జెట్ సమావేశాలా? మోదీ విద్వేశ సమావేశాలా? నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది? విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదు. ఆధారాలు లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. దేశ పరిస్థితులపై కేసీఆర్‌కు అవగాహన లేదు అని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఆర్థిక పరిస్థిలపై చర్చకు మేం సిద్ధం. ప్రగతి భవన్ లేదంటే ఫామ్‌హౌజ్‌కు రమ్మంటారా? అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ ఎక్కడకు రామ్మన్నా వస్తాం. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి. అసలు కేసీఆర్‌ను రాజీనామా ఎవరు అడిగారు? వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగు రాజీనామా చేయాల్సిందే అని అన్నారు.













