ఇది బలవంతపు ట్రైనింగ్ కాదు.. స్వచ్ఛందంగా సైన్యంలో
అగ్నిపథ్ వంటి పథకాలు దేశంలో చాలా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం మంచిది కాదు. సికింద్రాబాద్ ఘటన పథకం ప్రకారమే కుట్రచేసి విధ్వంసం సృష్టించారు. ఇది బలవంతపు ట్రైనింగ్ కాదు. స్వచ్ఛందంగా సైన్యంలో చేరవచ్చు. జాతీయభావం తీసుకురావడంతో భాగంగా అగ్నిపథ్‌ను తీసుకువచ్చాము. అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదు. కుట్రపూరితంగానే అగ్నిపథ్‌పై ప్రచారం జరుగుతోందన్నారు. అగ్నిపథ్‌లో చేరడం యువకులకు అదనపు అర్హత. కొందరు కావాలని విధ్వంసం సృష్టించాలని సూచిస్తున్నారు. విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. రైల్వే కోచ్‌లు తగలబెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రైల్వే స్టేషన్‌ను టార్గెట్ చేసి దాడి చేశారు. 6 గంటల పాటు రైవ్వే స్టేషన్లో అలజడి సృష్టించారు. బైకులు, రైల్వే, ప్రాపర్టీ, స్టాల్స్‌ను తగులబెట్టారు. శాంతిభద్రతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆర్పీఎఫ్ లా అండ్ చూడదు అంటూ హెచ్చరించారు. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉంది, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని అన్నారు.













