రైతుల కోసం కాదు… రాజకీయం కోసమే
రైతుల కోసం కాదు, రాజకీయం కోసమే సీఎం కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. ముద్దుల కొడుకు కేటీఆర్ కోసమే కేసీఆర్ దీక్షలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఒక విధానం దేశానికి ఒక విధానం ఉండదన్నారు. తెలంగాణ రైతుల కోసం కేంద్రం రూ.3400 కోట్లు ఖర్చు చేసింది. ఎరువులపై ఒక్క రూపాయి కూడా పెరగలేదు. కేంద్రంపై సీఎం కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారు. వడ్ల విషయంలో లేని సమస్యను ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొంటామని ఇప్పటికే కేంద్రం చెప్పిందన్నారు. ఉచితంగా ఎరువులిస్తామన్న కేసీఆర్ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు.













