Modi: ప్రధాని వద్దని చెప్పినా.. ఆ అంశాలు లీక్ చేశారు
ప్రధాని మోదీ (Modi)తో తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలోని అంశాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్లో జరిగిన అంశాలు బయటకు చెప్పొద్దని ప్రధాని అన్నారని, అయినా ఆ విషయాలు బయటకు వచ్చాయని అసహనం వ్యక్తం చేశారు. ఆ అంశాలు బయటకు చెప్పినవారు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా (Social media) లో యాక్టివ్గా ఉండాలని ప్రధాని చెప్పారు. తెలంగాణ (Telangana)లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. దక్షిణ భారత్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉప రాష్ట్రపతులు అయ్యారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అని అన్నారు.






