అంగరంగ వైభవంగా సహస్ర చండీయాగం
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగం మూడోరోజూ అట్టహాసంగా కొనసాగింది. ప్రముఖ వైదిక నిర్వాహకులు, శృంగేరి పండితులు విరివింటి ఫణిశశాంకశర్మ, వ్యాసోజుల గోపికృష్ణ శర్మ బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చండీయాగం, మహాలక్ష్మీయాగం నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధూరి దంపతులు.. ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డి, ఆయన భార్య లక్ష్మీ, వారి కుమారులు, మాతృమూర్తి స్వరాజ్యం ఈ క్రతువులో పాల్గొని పూజలు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు పి.వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, దిశాకమిటీ సభ్యుడు మట్టా దయానంద్ విజయ్‌కుమార్, గుర్రం తిరుమలరావు, సింగరేణి ఉన్నతాధికారులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.













