హైదరాబాద్కు కేరళ సీఎం పినరయి విజయన్
జనవరి 8న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ మలయాళీ సంఘాల ఆహ్వానం మేరకు సికింద్రాబాద్లోని హరిహరకళాభవన్లో జరిగే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా పినరయి విజయ్ను ఘనంగా సన్మానించేందుకు మలయాళీ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో నివసిస్తున్న మలయాళీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా సంఘాలు విజయన్ దృష్టికి తీసుకెళ్లనున్నాయి. కేరళ శాసనసభ ఎన్నికల్లో ఎల్డిఎఫ్ సంపూర్ణ మెజార్టీ సాధించి తిరిగి అధికారం చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ గౌరవార్థం సన్మాన సభ ఏర్పాటు చేసినట్లు మలయాళీ సంఘాల నాయకులు లిబి బెంజమెన్, రాధాకృష్ణ, ప్రదీప్ తెలిపారు.













