KCR: నేడు అసెంబ్లీకి కేసీఆర్
శాసనసభ సమావేశాల తొలిరోజు నేడు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ (KCR)అసెంబ్లీకి హాజరవుతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఎర్రవెల్లి (Erravelli) నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్‌తో మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తదితరులు సమావేశమయ్యారు. సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, ఇవ్వాల్సిన వివరణలు, ఎదుర్కోవాల్సిన తీరుతెన్నులపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులు పనులు, డీపీఆర్ తదితర అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ ఉద్యమ కార్చాచరణ నిర్ణయించిన అనంతరం, ప్రభుత్వం ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చించినట్లు సమాచారం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై బలంగా పార్టీ స్వరం వినిపించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.






