రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్
ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎలాంటి విరామం లేకుండా, రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ, ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్. అలా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ 96 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఈసారి బీఆర్ఎస్సే అధికారంలోకి రాబోతుందని, గతంలో కంటే అధిక సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రజల్లో విశ్వాసం నింపారు కేసీఆర్. కాంగ్రెస్ గెలిచేది లేదు. సచ్చేది లేదు. ఆ పార్టీ గెలిస్తే డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దెవా చేస్తూ కేసీఆర్ తన ప్రచారాన్ని కొనసాగించారు. అక్టోబర్ 15వ తేదీన హుస్నాబాద్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఏ ఒక్క రోజు ఖాళీగా ఉండకుండా కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ దాదాపు 45 రోజుల పాటు తీరిక లేకుండా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.













