తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టం
తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్ (బొల్లారం), సనత్‌నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), ఎల్బీనగర్ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్)లో టిమ్స్ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అత్యవసరంగా ఏర్పాటైన గచ్చిబౌలి టిమ్స్‌ను ఆధునీకరించడంతో పాటు మిగతా మూడు టిమ్స్ అవతరించనున్నాయి. సనత్‌నగర్, ఎల్బీ నగర్ జీG4 విధానంలో దవాఖాన భవనాలు నిర్మిస్తారు. ఒక్కో టిమ్స్‌లో వెయ్యి పడకలు ఉంటాయి. మూడు టిమ్స్‌ల కోసం ప్రభుత్వం రూ.2,679 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.













