మహారాష్ట్ర నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ ?
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరొకవైపు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలంగాణను దాటి మహార్ఱాష్టలో కేసీఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్రలో ఇప్పటికే పలు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెపుతున్నారు. నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం. మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.













