అనుకోని అతిథి సీఎం కేసీఆర్
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో కరీంనగర్-హూజూరాబాద్ ప్రధాన రోడ్డును అనుకొని ఓ ఇంటి ఆవరణలో పెండ్లీ మండపం, బాజాభజంత్రీల నడువ వివాహం, అంతా పెండ్లీ హడావిడిలో ఉన్నారు. ఇంతలో ఆ దారిలో వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ఆగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వాహనం దిగి పెండ్లి మండపంలోకి వెళ్లి నూతన వధూవరులు వొడ్నాల కావ్వ- మనోహర్లను నిండు నూరేండ్లు ఆనందంతో జీవించాలని దీవించారు. దీంతో ఆ జంట ఆశ్చర్యపోయింది. సాక్షాత్తూ ముఖ్యంత్రి కేసీఆర్ అనుకోకుండా తమ పెండ్లికి రావడంతో నోటమాట రావడం లేదని ఆ నవదంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అనుకోని అతిథిగా సీఎం కేసీఆర్ మా పెండ్లికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఈటల రాజేందర్తోపాటు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక నాయకులున్నారు.













