రాసలీల మంత్రికి ఉద్వాసన..కవితకు పదవి..
తెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్యవహారాన్ని సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా చానెళ్లలో కూడా బ బయటపెట్టడంతో దీనిపై రాష్ట్రంలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. మంత్రి రాసలీలల వ్యవహారం బయటపడడంతో, రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. సీఎం కేసీఆర్ కూడా మంత్రి రాసలీలల వ్యవహారం పై సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు మంత్రికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
మంత్రిగా కవిత?
ఎమ్మెల్సీగా ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కవిత వ్యవహరించడానికి క్యాబినెట్ లో స్థానం కల్పిస్తేనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం దుమారం రేపుతున్న నేపధ్యంలో కెసిఆర్ మంత్రి పదవి నుండి సదరు మంత్రిని తొలగించినా, లేదా స్వయంగా మంత్రితో రాజీనామా చేయించినా కవితకు క్యాబినెట్లో బెర్త్ కు మార్గం సుగమం అయినట్టే. ఏదిఏమైనా క్యాబినెట్ మంత్రిగా కవితకు స్థానం పక్కా అని, రాసలీలలు మంత్రి అవుట్ అయితే క్యాబినెట్లోకి కవిత కూల్ గా ఇన్ అని జరుగుతున్న చర్చ ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మంది మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. కవితకు స్థానం ఇవ్వాలంటే ఎవరైనా ఒక మంత్రిని మంత్రి పదవి నుండి తప్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరికి వారు మంత్రి పదవి వదులుకునే అవకాశం లేదు. సీఎం కేసీఆర్ తప్పుకోమని చెప్తే తప్పుకునే మంత్రులు ఉన్నప్పటికీ వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. అకారణంగా వారిని పక్కన పెడితే అది ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ అవుతుంది. అయితే ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేసిన ఒక్కరోజులోనే బయటపడ్డ మంత్రి రాసలీలలు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేసిన ఒక్కరోజులోనే మంత్రి రాసలీలల వ్యవహారం బయటకు రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.













