మునుగోడులో కోసుకుంట్ల విజయానికి అందరూ కృషి చేయాలి: సీఎం కేసిఆర్
మునుగోడులో టీఆర్ఎస్ విజయం కోసం అందరూ కలిసి పని చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు కేసీఆర్ సూచనలు చేశారు. భవిష్యత్‌లో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు వస్తాయని సీఎం చెప్పారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తామని, కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామని నర్సయ్య గౌడ్, ప్రభాకర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలని బాగా ఆలోచించిన కేసిఆర్.. సర్వే రిపోర్టులు పరిశీలించిన తర్వాత, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేశారు.













