లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ నివాళి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో లాస్య అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.













