ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ కు సైకిల్ యాత్ర
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన రామాంజనేయరెడ్డి బృందం సీఎం కేసీఆర్ ప్రత్యేక పెయింటింగ్‌తో సైకిల్ యాత్ర చేపట్టి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలుసుకుని మంత్రి కేటీఆర్ అభినందించారు. దివ్యాంగుడిగా అనేక కష్టాలు ఎదుర్కొని స్వయం కృషితో ఆర్టిస్టుగా ఎదిగినట్లు రామాంజనేయరెడ్డి తెలిపారు. కేసీఆర్‌పై అభిమానంతో 20 రోజుల కష్టపడి కాన్వాస్‌పై గండికోట మట్టితో మోనో కలర్లో కేసీఆర్ ప్రత్యేక పెయింటింగ్‌ను గీశానని కేటీఆర్‌కు ఆయన వివరించారు. ప్రొద్దుటూరు నుంచి ఏడు రోజుల్లో తమ బృందం హైదరాబాద్‌కు చేరుకున్నట్లు వివరించారు.













