మళ్లీ తెరపైకి ఓటుకు నోటు
తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ, ఏసీపీ డీజీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏకేఖాన్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తెలంగాణ శానసభ నుంచి కౌన్సిల్ కోసం ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలను తమవైపు తిప్పుకొనేందుకు తెలంగాణ టీడీపీ నేతలు రూ.50 లక్షలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇవ్వజూపారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపులు, విజువల్స్‌ను బయట పెట్టడంతో ఒక్కసారిగా రాజకీయ దూమారం చెలరేగింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కేసును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫోరెన్సిక్ విభాగం నివేదికను దర్యాప్తు అధికారులు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.













