బీజేపీ పార్టీ టార్గెట్గా కేసీఆర్ కొత్త ప్లాన్.. అధికారాలే అస్త్రాలు
కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు, దర్యాప్తు సంస్థలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహ రచన చేస్తున్నారు. పార్టీ నేతలే లక్ష్యంగా పనిచేస్తున్న దర్యాప్తు సంస్థలను తిప్పికొట్టేందుకు తనదైన స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారు. తన అధికారాలనే అస్త్రాలుగా మలుస్తూ బీజేపీ నేతలే టార్గెట్గా రాష్ట్ర దర్యాప్తు సంస్థలను బరిలోకి దించుతున్నారు. ఇదే వ్యూహాన్ని పార్టీ నేతలకు ఎల్పీ సమావేశంలో కేసీఆర్ వివరించినట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడాల్సి అవరం ఎవరీ లేదని, సంస్థలు ఎంత దూరం వెళితే మనం కూడా అంత దూరం వెళదామని అన్నారు. బీజేపీ పార్టీనే ప్రధాన లక్ష్యంగా నేతలందరూ పనిచేయాలని, నియోజకవర్గాల్లో బీజేపీని దోషిగా నిలబెట్టాలని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ నేత కవితను పార్టీ మారాలని, బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని, రానున్న పది నెలలు పార్టీకి అత్యంత కీలకంగా మారనున్నాయని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, లేకుంటే ఎవరిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మునుగోడు ఉపఎన్నికలో తక్కువ ఓట్లు నమోదూన ప్రాంతాల్లో పార్టీ ఇన్ఛార్జీలకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారట. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారట. రానున్న సమయమంతా ఎన్నికలే టార్గెట్గా పనిచేయాలని, మునుగోడు వ్యూహాన్నే అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారని సమాచారం. దాంతో పాటుగా ప్రతి వందమందికి ఒక ఇన్ఛార్జ్ను నియమించి ప్రణాళికతో అంతా ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం.













