దసరా నాడు యధావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం.. స్పష్టం చేసిన కేసిఆర్
దసరా నాడు యధావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడొచ్చని వార్తలు వచ్చాయి. అయితే మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ప్రభావం సర్వసభ్య సమావేశంపై ఉండదని కేసీఆర్ తెలిపారు. ఇంతకుముందు ప్రకటించిన విధంగానే ఈ నెల 5న ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని అన్నారు. జాతీయ రాజకీయాలపై పార్టీలోని కీలక నేతలకు ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టతనిచ్చారు. టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు పార్టీ కార్యవర్గం తీర్మానం చేయనుంది. జాతీయ పార్టీ ఏర్పాటుపై మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ ప్రగతిభవన్లో చర్చిస్తారు.













