ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు-ఎన్నారైలు హర్షం
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయడంపై పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. నాడు 2001 ఏప్రిల్ 27న గుప్పెడుమందితో తెలంగాణ నడిబొడ్డున జల దృశ్యం లో ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్.. నేడు 2021 సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి సీఎం కేసీఆర్ చేతులమీదుగా భూమిపూజ చేసుకునే విధంగా ఎదగడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని మహేష్ బిగాల ఆకాంక్షించారు.













