నిజామాబాద్ కలెక్టరేట్‌ను ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్
నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సీ నారాయణరెడ్డిని కూర్చుండబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించింది. అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో అధికారి స్మితా సబర్వాల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.













