కొత్తగూడెం కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కొత్తగూడెంకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగా పోలీసుల నుంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్లో కలెక్టర్ అనుదీప్‌ను కూర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.













