ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి.. అసెంబ్లీకి హాజరైన కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన శాసనసభకు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సభకు రావడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది.