ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ప్రవాస భారతీయ క్రీడాకారులతో వచ్చే ఆగస్టులో కేసీఆర్ క్రికెట్ కప్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ దేశ బీఆర్ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, విక్టోరియా రాష్ట్ర కన్వీనర్ ఉప్పు సాయిరాం తెలిపారు. పార్టీకి ఆస్ట్రేలియాలో మద్దతు కూడగట్టడంతో పాటు ప్రవాస క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఈ పోటీలు జరుపుతున్నామన్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలంగాణ సహా 28 రాష్ట్రాల ప్రవాస భారతీయ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.













