సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ
వైద్యవిద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన చరిత్ర లిఖించారని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఎమిదేళ్లలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారన్నారు. కొత్తగా మరో 13 ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మరోవైపు వైద్యకళాశాలల మంజూరులో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందన్నారు. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ రాష్ట్రానికి ఒక్క కళాశాలనీ మంజూరు చేయలేదన్నారు. గత 67 ఏళ్ల కాలంలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలే తెలంగాణలో ఏర్పాటయాj్యయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దశలవారీగా మంజూరు చేస్తున్నారని తెలిపారు.













