తెలంగాణ భవన్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర మాజీ మంత్రి, సనత నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేక్ కట్ చేసి ముందుగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు తినిపించారు. కేసీఆర్ జన్మదిన వేడుకలకు మాజీ మంత్రులు, నగరంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.













