లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలి : సీఎం కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై పీఎం సమీక్ష చేపట్టారు. అదేవిధంగా లాక్డౌన్ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… లాక్‌డౌన్‌ను మరో 2 వారాలు పొడిగించాలని ప్రధానిని కోరారు. కరోనా కట్టడికి లాక్డౌన్ బాగా ఉపయోగపడిందన్నారు. కరోనా సమర్థ నియంత్రణకు లాక్‌డౌన్‌ను కనీసం రెండు వారాలపాటు కొనసాగించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదన్నారు. కరోనాపై యుద్ధంలో భారత్ తప్పక గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటానికి రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తోందన్నారు.













