ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి : సీఎం కేసీఆర్
ప్రధాని శ్రీ నరేంద్రమోడి పిలుపు మేరకు, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న #JanataCurfew ను, తెలంగాణ వ్యాప్తంగా విధిగా ఎవరికివారు స్వచ్ఛందంగా పాటించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ కార్యక్రమం విజయవంతం చేయడానికి చేపట్టవలసిన ఏర్పాట్లు, కార్యాచరణ గురించి, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ, తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.













