31 వరకూ తెలంగాణ లాక్ డౌన్ : కేసీఆర్
మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో మీడియా మాట్లాడిన ఆయన అత్యవసర పనుల కోసం కుటుంబంలో ఒకరికే బయటికి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని అన్నారు. ఐదుగురికి మించి ఎక్కువ గుమిగూడ వద్దని.. ప్రతి ఒక్కరూ 3 మీటర్ల దూరం పాటించాలని అన్నారు. పేదలకు నెల రోజులకు సరిపడా రేషన్ బియ్యం ఇస్తామని.. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఒక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం అందిస్తామన్నారు. సరుకులు కొనుక్కునేందుకు బియ్యంతో పాటు రూ.1500 ఇస్తామని చెప్పారు. మార్చి 31 వరకు అన్ని కార్యక్రమాలు బంద్. వారం రోజులకు కార్మికులకు యజమాని వేతనాలు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.
ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు..ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమన్నారు. మార్చి 31వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ ఉంటుందని, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు బంద్ ఉంటయన్నారు.













