సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు క్యాండిడేట్ ను ప్రకటించిన కేసీఆర్..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తమ పార్టీ తరఫునుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేశారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. అసలు ఈ ఉప ఎన్నికలకు కారణం లాస్య నందిత హఠాన్మరణం. నివేదిత అక్క లాస్య నందిత ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అందుకే ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సాయన్న పెద్ద కుమార్తె లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందారు. ఫిబ్రవరి 23 తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఆమె మరణించారు. ఇప్పుడు ఆమె స్థానంలో ఆమె చెల్లెల్ని కేసీఆర్ పోటీకి దింపుతున్నారు.