రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈరోజుకి మూడవరోజు విచారణ ముగిసింది. ఇదే విధంగా కవితను ఇండోస్పిరిట్ లో 33 శాతం వాటా పై.. 100 కోట్ల ముడుపులు ఎలా వచ్చాయి అన్న విషయంపై ఈడి విచారించింది. అంతేకాదు మొబైల్ ఫోన్ ని ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయంపై కూడా కవితను ఈడీ బృందం ప్రశ్నించారట. విచారణ అనంతరం ఆమెను వైద్య పరీక్షల కోసం తరలించారు. ఇవి జరిగిన తరువాత కేటీఆర్ మరియు న్యాయవాదుల బృందం కవితను కలవనున్నారు. అయితే గత ఏడాది మార్చి 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు అరెస్ట్ అవ్వడంతో ఈ వ్యాజ్యంపై విచారణ చేయాల్సిన అవసరం లేదు అని భావించి కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె తరపు లాయర్ తెలియజేశారు. కవిత లిక్కర్ స్కామ్ కేస్ రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇక ఈ కేసు విషయంలో మరి అందరి బడా బాబుల పేర్లు బయట పడతాయో చూడాలి.