కవిత కు తప్పని కస్టడీ తిప్పలు..

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు ఆయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు లో కొత్త మలుపు చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం కవిత ను ఐదు రోజులు తమ కస్టడీ లో ఉంచాలి అని సీబీఐ రిక్వెస్ట్ కు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కవిత ను సీబీఐ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. మద్యం కేసులో కవిత చాలా కీలకమైన వ్యక్తిగా సీబీఐ తన పిటీషన్లో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ తన కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. అలాగే జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి కవితను డబ్బుల కోసం బెదిరించినట్లు సీబీఐ తమ పిటీషన్ లో పేర్కొంది. ఒకపక్క కవిత బెయిల్ కోసం పెట్టే పిటీషన్లు క్యాన్సిల్ అవుతుంటే.. మరో పక్క ఆమె కస్టడీ కోసం పెట్టే పిటిషన్లు మాత్రం ఆమోదించబడుతున్నాయి.