కవితకు షాక్ ఇచ్చిన కోర్టు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉగాది రోజే ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆమె రిమాండ్ ను పొడిగించాలి అని ఈడీ చేసిన విన్నపానికి సానుకూలంగా స్పందించిన కోర్టు కవిత రిమాండ్ ను మరొక 14 రోజులపాటు పొడిగించింది. అంటే వచ్చే ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ లోని ఉంటారు అని కోర్టు తీర్పునిచ్చింది. తాజా తీర్పు ప్రకారం ఏప్రిల్ 23 వరకు తీహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. కొడుకును ఎగ్జామ్ కి చదివించుకోవాలి అంటూ కవిత పెట్టుకున్న మభ్యంతర బెయిల్ పిటిషన్ కూడా కోర్టు నిన్న తిరస్కరించింది.