గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలకుగానూ నోటీసులు అందుకున్న ఆయన జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి ఎన్డబ్ల్యూసీ సమక్షంలోనే లిఖిత పూర్వక క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఫైల్స్‌ను తన దగ్గరే పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదంటూ తీవ్ర పదజాలంతో పలు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి. అయితే ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్, ఆయనకు నోటీసులు జారీ చేసింది.













